అభ్యాసము కూసు విద్య
అచ్చిగాడి పెళ్ళిలో బుచ్చిగాడికి ఒక జంధ్యపు పోగు
అడగనిదే అమ్మైనా పెట్టదు
అబద్ధం ఆడినా అతికినట్లు ఉండాలి
అడవి కాచిన వెన్నెలలా
అడవిలో పెళ్ళికి జంతువులే పురోహితులు
అడ్డాల నాడు బిడ్డలు కానీ,గడ్డాల నాడు కాదు
అద్దం అబద్ధం చెప్పదు
అడిగే వాడికి చెప్పేవాడు లోకువ
అదిగో పులి అంటే ఇదిగో తోక అంటారు
అడుక్కునే వాడికి చెప్పులు కుట్టుకునే వాడు
అడుక్కున్నమ్మకి 60 కూరలు,వండుకున్నమ్మకు ఒకటే కూర
అడుసు తొక్కనేల కాలు కడగనేల
అగడ్తలో పడ్డ పిల్లికి అదే వైకుంఠం
అగ్నికి ఆజ్యం పోసినట్లు
అగ్నికి వాయువు తోడైనట్లు
అమాయకునికి అక్షింతలు ఇస్తే ఆవలకి వెళ్ళి నోట్లో వేసుకున్నాడట
అంబలి తాగేవాడికి మీసాలెత్తేవాడు ఒకడు …
అంభం లో కుంభం లా
అమ్మ కడుపు తడుముతుంది,పెళ్ళం జేబు తడుముతుంది
అందం అన్నం పెట్టదు
అందని మ్రానిపండ్లకు అర్రులు చాచుట
అంధుని ముందు అందాలేల?
అందితే సిగ అందక పోతే కాళ్ళు
అంగట్లో అన్నీ ఉన్నా,అల్లుడి నోట్లో శని ఉన్నట్లు
అన్న దానం కంటే విద్యా దానం గొప్పది
అన్నం పరబ్రహ్మ స్వరూపం
అన్నప్రాశన నాడే ఆవకాయ పచ్చడి
అన్నపు చొరవే గాని అక్షరపు చొరవ లేదు
అన్నీ వున్న విస్తరాకు అణిగిమణిగి ఉందట ఏమీ లేని విస్తరాకు ఎగిరెగిరి పడ్డదట…
అన్ని దానములలొ విద్యా దానం గొప్పది
అన్ని చోట్లా బావే కానీ వంగ తోట కాడ మాత్రం కాదు
అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరం మేలు
అనుమానం పెనుభూతం
అప్పిచ్చువాడు వైద్యుడు
అర్ధరాత్రి మద్దెలదరువు
అసలే లేదంటే పెసరపప్పు వండమన్నాడట ఒకడు
అసలు కంటే వడ్డీ ముద్దు
అసలుకే ఎసరు పెట్టినటు
అసమర్థుడికి అవకాశమివ్వనేల?
అతి రహస్యం బట్ట బయలు
అత్త లేని కోడలుత్తమురాలు,కోడలు లేని అత్త గుణవంతురాలు
అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు
అత్త సొమ్ము అల్లుడు దానం
అయిన వారికి అరిటాకుల్లో కాని వారికి కంచాల్లో
అయితే ఆదివారం,కాకుంటే సోమవారం
అయ్యవారు వచ్చే వరకూ అమావాస్య ఆగుతుందా?
అయ్యకి లేక అడుక్కుని తింటుంటే,కొడుకొచ్చి కోడి పలావు అడిగాట్ట
అయ్యవారిని చెయ్యబోతే కోతి అయ్యినట్లు
ఆ తాను ముక్కే !!!
ఆడబోయిన తీర్థం యెదురైనట్లు
ఆడదాని వయసు మగవాని సంపాదన అడగొద్దన్నట్టు
ఆడది సాధించలేనిది లేదు,ముఖ్యంగా మొగుడిని
ఆడలేక మద్దెల వోడు అన్నట్లు
ఆడవాళ్ళకి బట్టతల రాదేమండి? బెట్టుదల ఎక్కువగనుక
ఆది లోనే హంస పాదు
ఆడి తప్ప రాదు,పలికి బొంక రాదు
ఆకాశానికి హద్దు లేదు
ఆకలి రుచి యెరుగదు,నిద్ర సుఖం ఎరుగదు,వలపు సిగ్గెరుగదు
ఆకలి వేస్తే రోకలి మింగమన్నాట్ట
ఆకు ఎగిరి ముల్లు మీద పడ్డ,ముల్లు వచ్చి ఆకు మీద పడినా చిరిగేది ఆకే
ఆలశ్యం అమృతం విషం
ఆలు లేదు,చూలు లేదు,కొడుకు పేరు సోమలింగం అన్నట్టు
ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ
ఆరోగ్యమే మహాభాగ్యము
ఆస్థి మూరెడు ఆశ బారెడు
ఆత్రగానికి బుద్ధి మట్టము
ఆవలింతకు అన్న ఉన్నాడు కాని,తుమ్ముకు తమ్ముడు లేడంట
ఆవలిస్తే పేగులు లెఖ్ఖ పెట్టినట్లు
ఆవు చేల్లో మేస్తే,దూడ గట్టున మేస్తుందా?
ఆయనే ఉంటే మంగలి ఎందుకు అని?
ఆడవారి మాటలకు అర్థాలే వేరులే
ఆకులు నాక్కునే వాడి దగ్గర మూతులు నాక్కునే వాడట
ఆశపోతు బ్రాహ్మడు లేచిపోతూ పప్పు అడిగాడుట
బావిలో కప్పలా…
బంక్తిలో బాలపక్షం
బతకలేక బడి పంతులయినట్టు
బతికుంటే బలుసాకు తినవచ్చు
బెల్లం చుట్టూ ఈగల్లా
బెల్లం కొట్టిన రాయిలా
భార్యా రూపవతి శత్రు:
భక్తి లేని పూజ పత్రి చేటు
బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ
బోడి ముండకి మంగళ హారతి ఒకటి
బొంకులెన్నే కోడలా అంటే-అని అనిపించుకో అత్తగారా నీకు ఆరు నాకు మూడు అందట
బూడిదలో పోసిన పన్నీరు
చాదస్తపు మొగుడికి తెలీదు,చెపితే వినడు,కొడితే ఏడుస్తాడు
చాప కింద నీరులాగ
ఛావు కబురు చల్లగ చెప్పినట్లు
చావు తప్పి కన్ను లొట్ట పోయినట్లు
చచ్చినవాని కళ్ళు చారెడు
చచ్చిన వాడి పెళ్ళికి వొచ్చిందే కట్నం
చద్ది కూడు తిన్నమ్మ మొగుడాకలి యెరగదట
చదవేస్తే ఉన్నమతి పోయినట్టు
చదువు రాని వాడు వింత పశువు
చేతకానమ్మకే చేష్టలెక్కువ
చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు
చక్కనమ్మ చిక్కినా అందమే
చల్ల కొచ్చి ముంత దాచినట్లు
చంకలో పిల్లాడ్ని పెట్టుకుని ఊరంతా తిరిగినట్టు…
చస్తుంటే సంధ్య మంత్రమన్నాడట ఒకడు…
చెడపకురా చెడేవు
చెముడా అంటే మొగుడా అన్నట్టు
చెప్పే వాడికి వినే వాడు లోకువ అన్నట్టు…
చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు,దూరేవన్నీ దొమ్మరి గుడిసెలు
చెరపకురా చెడెదవు,ఉరకకురా పడెదవు
చెరువుకి నీటి ఆశ,నీటికి చెరువు ఆశ
చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకున్నట్లు
చెవిలో జొరీగలాగ…
చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లు
చెవిటోడి పెళ్ళికి,మూగోడి కచ్చేరీ
చిల్లర దేవుళ్ళకు చేరువయితే,అసలు దేవుడికి దూరమౌతావు
చిన్న పామునైనా పెద్ద కర్రతోటే కొట్టాలి
చింత చచ్చినా పులుపు చావ లేదు
చింతకాయలు అమ్మేదానికి సిరిమానం వస్తే,ఆ వంకర టింకరవి యేమి కాయలని అడుగుతుందట
చిత్తం శివుని పైన,భక్తి చెప్పుల పైన
చిలికి చిలికి గాలివాన అయినట్లు
చూసి రమ్మంటే కాల్చి వచ్చినట్టు
దాసుని తప్పు దండంతో సరి
డబ్బేమన్నా చెట్టుకి కాస్తుందా?
డబ్బివ్వని వాడు పడవ ముందు యెక్కాడట
డబ్బూ పోయే శని కూడాపట్టే అన్నట్టు
డబ్బుకు లోకం దాసోహం
దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వనట్టు
దక్కిందే దక్కుడు
దమ్మిడి ముండకి ఏగాణి క్షవరం
దంపినమ్మకు బొక్కిందే కూలన్నట్టు
దండం దశగుణంభవేత్
దరిద్రుడి పెళ్ళికి వడగళ్ళ వాన
దయగల మొగుడు తలుపు దగ్గరకు వేసి కొట్టాడట
దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి
దేవుడి గుదిలోనే పదిలం బయటకు వస్తే పదలం
దెయ్యాలు వేదాలు వల్లించినట్లు
దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కు
దినదిన గండం,దీర్ఘాయుస్షు
దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్లు
దొంగకు దొంగ బుద్ధి,దొరకు దొర బుద్ధి
దొంగకు తేలు కుట్టినట్లు
దూరపు కొండలు నునుపు
దొరికితేనే దొంగలు,దొరక్క పొతే అందరూ దొరలే
దున్నపోతు మీద వర్షం కురిసినట్లు
దురాశ దుఖానికి చేటు
ఎద్దు పుండు కాకికి నొప్పా?
ఎగిరే గాలిపటానికి దారం ఆధారం
ఎక్కడైనా బావే కానీ వంగతోట దగ్గర మాత్రం కాదు
ఎవరు తీసిన గోతిలో వారే పడతారు
ఏనుగు బ్రతికినా వెయ్యే,చచ్చినా వెయ్యే
ఏ చెట్టూ లేని చోట ఆముదము చెట్టే మహా వృక్షం
ఏ ఎండకు ఆ గొడుగు
గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపడితే,ఒంటె అందానికి గాడిద మూర్చ పోయిందట
గాజుల బేరం భోజనానికి సరి
గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారం అన్నట్టు
గాలికిపోయే దానిని గుండుకి చుట్టుకున్నట్లు
గంతకు తగ్గ బొంత
గతి లేనమ్మకు గంజే పానకము
గోరు చుట్టు మీద రోకలి పోటు
గోడ మీద రాసుకున్న రేపు ఎప్పటికీ రాదు
గోడ మీది పిల్లి వాటం
గోడలకు చెవులుంటాయి
గొడ్డుని చూసి గడ్డెయ్యాలి
గోముఖ వ్యాఘ్రం
గొంతెమ్మ కోరికలు
గోటితో పొయ్యేదానికి గొడ్డలి వాడినట్టు
గుడ్డి కన్నా మెల్ల మేలు
గుడ్డెద్దు జొన్న చేల్లో పడినట్లు
గుడ్డోచ్చి పిల్లని వెక్కిరించినట్లు
గుడ్డి కన్ను మూసినా ఒకటే తెరిచినా ఒకటే
గుడి మింగే వాడికి నంది పిండిమిరియం
గుడిని గుడిలో లింగాన్ని మింగినట్లు
గుడ్ల మీద కోడిపెట్టలాగ
గుంభనం గునపం లాంటిది,బయటే వాడుకోవాలి,కడుపులో వుంటే పోట్లు పొడుస్తుంది
గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నాడట
గుర్రం గుడ్డిదైనా దాణాకి లోటు లేదు
గురువుకి పంగనామాలు పెట్టినట్లు
గురువును మించిన శిష్యుడు
ఇంట గెల్చి రచ్చ గెలువమన్నారు
తిన్నింటి వాసాలు లెఖ్ఖపెట్టినట్లు
ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టలేడు
ఇంటి పేరు కస్తూరివారు ఇంట్లో గబ్బిలాల కంపు
ఇంటికన్నా గుడి పదిలం
ఇంట్లో చూరు కింద నీళ్ళు తాగి,బయటకొచ్చి చల్ల తాగామని చెప్పుకున్నట్టు
ఇంట్లో ఈగల మోత బైట పల్లకీ మోత
ఇస్తే హిరణ్య దానం,ఇవ్వక పొతే కన్యాదానం
ఇసుక తక్కెడ పేడ తక్కెడ
ఐశ్వర్యం వస్తే అర్థ రాత్రి గొడుగు పట్టమనేవాడు
జోగీ జోగీ రాసుకుంటే రాలేది బూడిదే
జుత్తు వున్న అమ్మ యే కొప్పైనా పెడుతుంది
కాచిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు
కాగలకార్యం గంధర్వులే తీర్చినట్లు
కాకి ముక్కుకు దొండపండు
కాకి పిల్ల కాకికి ముద్దు
కాకిలా కలకాలం బ్రతికేకన్నా,హంసలా ఆరు నెలలు బ్రతికితే చాలు
కాలం కలిసి రాకపొతే,కర్రే పామై కాటు వేస్తుంది
కాలికేస్తే మెడకి,మెడకేస్తే కాలికి
కాలు జారితే తీసుకోగలం కానీ నోరు జారితే తీసుకోలేము
కాషాయం కట్టిన వాళ్ళందరూ సన్యాసులు కారు,కషాయం మింగినవాళ్ళందరికీ కఫం కరగదు
కాయా పండా?
కధ కంచికి మనం ఇంటికి
కడుపా?కళ్ళేపల్లి చెరువా?
కడుపు చించుకుంటే కాళ్ళపైన పడ్డట్లు
కలకాలపు దొంగైనా ఏదో ఒకనాడు దొరుకుతాడు
కలిమిలేములు కావడి కుండలు
కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు పుడతాడన్నట్టు
కళ్యాణమొచ్చినా కక్కొచ్చినా ఆగదన్నట్లు
కనకపు సింహాసనమున శునకమును కూర్చుండబెట్టినట్టు…
కంచే చేను మేసినట్లు
కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా!
కందకులేని దురద కత్తి పీటకెందుకు?
కడవంత గుమ్మడికాయ కత్తి పీటకు లోకువ
కందెన వేయని బండికి కావాల్సినంత సంగీతం
కరవమంటే కప్పకు కోపం,విడవమంటే పాముకు కోపం
కర్ర ఇచ్చిమరీ పళ్ళు రాలకొట్టించు కోవడం
కష్టే ఫలే
కట్టె కొట్టె తెచ్చె…
కయ్యానికి కాలు దువ్వడం
కీడెంచి మేలెంచమన్నారు
కొడితే ఏనుగు కుంభస్థలం మీద కొట్టాలి
కొంప కొల్లేరు అయ్యింది
కొనబోతే కొరివి అమ్మబోతే అడివి
కొండనాలిక్కి మందేస్తే ఉన్ననాలిక ఊడినట్లు
కొండల్లే వచ్చిన ఆపద కూడా మంచులా కరిగినట్లు
కొండను తవ్వి యెలుకను పట్టినట్లు
కూటికి పేదైతే కులానికి పేదా?
కొప్పున్నమ్మ కోటి ముడులు వేస్తుంది
కొరకరాని కొయ్యలా
కొరివితో తల గోక్కోవడం
కోతిపుండు బ్రహ్మరాక్షసి
కోతికి కొబ్బరిచిప్ప ఇచ్చినట్లు
కొత్తొక వింత పాతొక రోత
కోటివిద్యలు కూటి కొరకే
కొత్త అప్పుకు పోతే పాత అప్పు బయటపడ్డదట
కొత్త బిచ్చగాడు పొద్దు యెరగడు
కృషితో నాస్తి దుర్భిక్షం
క్షేత్రమెరిగి విత్తనం పాతాలి,పాత్రమెరిగి దానము చెయ్యాలి
కూసే గాడిదొచ్చి మేసే గాడిదను చెడగొట్టిందట
కుడుము చేతికిస్తే పండగ అనేవాడు
కుక్క కాటుకు చెప్పు దెబ్బ
కుక్క వస్తే రాయి దొరకదు,రాయి దొరికితే కుక్క రాదు
కుక్షిలో అక్షరం ముక్క లేదు కానీ
కుళ్ళు ముండకి అల్లంపచ్చడి అన్నట్టు
కుంచమంత కూతురుంటే అన్నీ మంచెలోనే
లేని దాత కంటే ఉన్న లోభి నయం
లోగుట్టు పెరుమాళ్ళకెరుక
మా తాతలు నేతులు తాగారు మా మూతులు వాసన చూడండి అన్నట్లు
మాటలు చూస్తే కోటలు దాటుతాయి
మాటలు నేర్చిన కుక్క ఉస్కో అంటే ఉస్కో అందట
మంచమున్నంత వరకు కాళ్ళు చాచుకో
మంచి వాడు మంచి వాడు అంటే మంచమెక్కి గంతులేసాడుట
మంచికి పొతే చెడెదురైనట్లు
మంచిమాటకు మంది అంతా మనవాళ్ళే
మంది యెక్కువయితే మజ్జిగ పలచన అయినట్లు
మందుకి పంపితే మాసికానికి వచ్చాడట
మనిషి మర్మము,మాని చేవ బయటకు తెలియవు
మనిషికి మాటే అలంకారం
మనసుంటే మార్గముంటుంది
మంచిమనిషికొక మాట-గొడ్డుకొక దెబ్బ
మనిషికొక తెగులు మహిలోసుమతీ
తానొకటి తలిస్తే దైవమొకటి తలిచినట్టు
మంత్రాలకు చింతకాయలు రాలవు
మంత్రాలు తక్కువ తుంపర్లు ఎక్కువ
బోడి సంపాదనకు ఇద్దరు పెళ్ళాలా?
మేకవన్నె పులి
మెరిసేదంతా బంగారం కాదు
మెత్తగా ఉంటే మొత్త బుద్ధి అయ్యిందట
మింగ మెతుకులేదు మీసాలకు సంపెంగ నూనె!
మొదటికే మోసం
మొదట భోగి,భోగాలెక్కువై రోగి,రోగాలు భరించలేక యోగి
మొగుడ్ని తన్ని మొగసాలకెక్కిందట
మొగుడు కొట్టినందుకు కాదు,తోడికోడలు దెప్పినందుకు
మొహమటానికి పొతే కడుపు అయ్యిందట
మొక్కై వంగనిది మానై వంగునా?
మొండి వాడు రాజు కన్నా బలవంతుడు…
మూల విగ్రహానికి లేక ఈగలు తోలుకుంటుంటే,ఉత్సవ విగ్రహాలు వచ్చి వూరేగింపు ఎప్పుడు అన్నాయట
మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు
మూణ్ణాళ్ళ ముచ్చట
మొరటోడికి మొగలి పువ్విస్తే మడిచి ముడ్లో పెట్టుకున్నాడట
మొరిగే కుక్క కరవదు
మోసేవానికే తెలుస్తుంది కావడి బరువు
ముడ్డి మీద తంతే మూతి పళ్ళు రాలినట్టు
ముక్కు పట్టుకోమంటే బ్రాహ్మడి ముక్కు పట్టుకున్నాడట
ముక్కు మీద కోపం
ముక్కు సూటిగా పోవడం
ముళ్ళ కంప మీద పడిన గుడ్డలా…
ముల్లును ముల్లుతోటే తియ్యాలి,వజ్రాన్ని వజ్రం తోటే కొయ్యాలి
ముండా కాదు,ముత్తైదువా కాదు
ముందర కాళ్ళకి బంధాలు వేసినట్లు
ముందుకు పోతే గొయ్యి-వెనుకకు పోతే నుయ్యి
ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి
ముందుంది ముసళ్ళ పండగ
ముంజేతి కంకణానికి అద్దం యెందుకు?
ముసలాడికి దసరా పండగన్నట్లు
నారు పోసిన వాడే నీరు పోస్తాడు
నడమంత్రపు సిరి నరం మీద పుండు నిలబడనియ్యవు
నేతి బీరకాయలో నెయ్యి యెంత ఉందో,నీ మాటలో అంతే నిజం ఉంది
నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా
నాట్యం చెయ్యవే రంగసానీ అంటే నేల వంకర అందట
నవ్వే ఆడదాన్ని,ఏడ్చే మగవాడ్ని నమ్మ కూడదు
నవ్విన నాప చేనే పండుతుంది
నవ్వు నాలుగు విధాల చేటు
నవ్వులు పోయి నువ్వులౌతాయి
నీ చెవులకు రాగి పోగులే అంటే అవీ నీకు లేవే అన్నట్లు
నీ కంటి పొరలు తొలగించి చూడు,అందరి లోనూ మంచినే చూడగలవు
నీ నెత్తి మీద ఏదో ఉంది అంటే అదేదో నీ చెత్తోనే తీసెయ్యి అన్నాడట
నీ ఎడమ చెయ్యి తియ్యి నా పుర్ర చెయ్యి పెడతానన్నాడట ఒకడు…
నాకోడి కూస్తేకాని తెల్లవారదన్నట్టు
నీరు పల్ల మెరుగు,నిజము దేముడెరుగు
నిదానమే ప్రధానం
నిజం నిలకడ మీద తెలుస్తుంది
నిజం నిప్పు లాంటిది
నిమ్మకు నీరెత్తినట్లు
నిండా మునిగిన వానికి చలి యేమిటి?
నిండు కుండ తొణకదు
నిన్నటి అబద్ధాన్ని ఇవ్వాల్టి నిజంతో కప్పి పుచ్చలేము
నిప్పు ముట్టనిది చెయ్యి కాలదు
నూరు గొడ్లు తిన్న రాబందుకైనా ఒక్కటే గాలిపెట్టు
నోరు మంచిదైతే ఊరు మంచిది
నువ్వు ఎక్కాల్సిన రైలు ఎప్పుడూ ఒక జీవితకాలం ఆలస్యం,అది దేవుడు నీ జీవితంపై వేసిన వేటు
నువ్వు మేకని కొంటే నేను పులిని కొని నీ మేకని చంపిస్తా అన్నాడట
ఓడ ఎక్కేదాకా ఓడ మల్లన్న ఓడ దిగిన తర్వాత బోడి మల్లన్న అన్నట్టు
ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు
ఓలి తక్కువని గుడ్డిదాన్ని పెళ్ళాడాట్ట
ఒంటి పూట తిన్నమ్మ ఓర్చుకుంటే,మూడు పూటలు తిన్నమ్మ మూర్చ పోయిందట
ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడి
ఊపిరి ఉంటే ఉప్పమ్ముకుని బ్రతకవచ్చు
ఊరక రారు మహానుభావులు
ఊరంతా చుట్టాలేకాని ఉట్టికట్ట తావు లేదు
ఊరు మొహం గోడలు చెపుతాయి
ఊరు పొమ్మంటోంది కాడు రమ్మంటోంది
ఊరుకున్నంత ఉత్తమం లేదు,బోడి గుండంత సుఖం లేదు
ఒట్టు తీసి గట్టున పెట్టు
పాడిందే పాడరా పాచిపళ్ళ దాసరీ
పాకీ దానితో సరసం కంటే అత్తరు సాయబ్బు తో కలహం మేలు
పాము కాళ్ళు పామున కెరుక
పానకంలో పుడకలాగ
పాపమని పాత చీర ఇస్తే గోడ చాటుకు వెళ్ళి మూర వేసిందట
పాపి చిరాయువు
పచ్చ కామెర్ల వాడికి లోకం అంతా పచ్చగా కనపడినట్లు
పదుగురాడు మాట పాడియై చెల్లు
పక్కలో బల్లెం లాగ
పండగనాడు కూడా పాత మొగుడే అన్నట్లు
పంచ పాండవులు ఎంత మంది అని అడిగితే మంచం కోళ్ళలా ముగ్గురు అని రెండు వేళ్ళు చూపించాడట
పాండవులు సంపాదించిన రాజ్యం కౌరవుల తద్దినానికే సరిపోయిందట
పండిత పుత్ర:పరమ శుంఠ:
పనిలేని మంగలి పిల్లి తల గొరిగినట్టు
పప్పులో కాలేసినట్టు…
పరాయి సొమ్ము పాము వంటిది
పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగడం మేలు
పట్ట పగలు కాకులు కావు కావు మంటుంటే మొగుడ్ని కౌగలించుకుందట
పట్టిందల్లా బంగారమైనట్లు
పెదవి దాటిటే పృధివి దాటుతుంది
పీనాసి వాడి పెళ్ళికి పచ్చడి మెతుకులు సంభావనట
పెళ్ళి అంటే నూరేళ్ళ పంట
పిడుక్కీ బియ్యానికీ ఒకటే మంత్రం అన్నట్టు
పెళ్ళికి వెళ్తూ పిల్లిని చంకన పెట్టుకు వెళ్ళినట్టు
పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు
పేనుకు పెత్తనమిస్తే తలంతా కొరికి వదిలిపెట్టిందట
పెరుగుట తరుగుట కొరకే
పెరటి చెట్టు వైద్యానికి పనికి రాదు
పిచ్చోడి చేతిలో రాయిలా
పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం
పిలవని పేరంటానికి వెళ్ళినట్లు
పిలిచి పిల్లనిస్తానంటే కులం తక్కువ అన్నాట్ట
పిల్లికి బిచ్చం వేయడు
పిల్లి శాపాలకు ఉట్లు తెగుతాయా?
పిల్లికి చెలగాటం,ఎలుకకు ప్రాణ సంకటం
పిల్లికి ఎలుక సాక్ష్యం
పిండి కొద్ధీ రొట్టె
పిట్ట కొంచెం కూత ఘనం
పోరు నష్టం పొందు లాభం
పూస గుచ్చినట్లు చెప్పడం
పోరాని చోట్లకు పోతే రారాని మాటలు రాకపోవు
పొర్లించి పొర్లించి కొట్టినా మీసాలకు మట్టి అంటలేదన్నాడట
పొరుగింటి పుల్ల కూర రుచి
పొట్ట కోస్తే అక్షరం ముక్క లేదు అన్నట్లు
పొట్టి వానికి పుట్టెడు బుద్ధులు
పోటుగాడు పందిరి వెస్తే పిచికలు వచ్చి కూల దోసాయట
పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు
పుండు మీద కారం చల్లినట్లు
పుణ్యం కొద్దీ పురుషుడు,దానం కొద్దీ బిడ్డలు
పువ్వు పుట్టగానే పరిమళించును
రాజు గారి దివాణంలో చాకలోడి పెత్తనం
రాజుని చూసిన కళ్ళతో మొగుడ్ని చూస్తే చులకనే కదా
రామాయణంలో పిడకలవేట
రాత రాళ్ళ పాలు ఐతే,మొగుడు ముండ పాలు అయ్యాడట
రాజు గారి రెండో భార్య మంచిది అంటే మరి పెద్ద భార్య?
రాజు తలచుకుంటే దెబ్బలకు కొదువా
రామాయణం అంతా విని సీత రాముడికి ఏమౌతుందని అడిగినట్లు
రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం వదలనట్లు
రంకు నేర్చినమ్మ బొంకు నేర్వదా అన్నట్లు
రవి కాంచని చోట కవి గాంచునట…
రెడ్డొచ్చె మొదలాడె అన్నట్టు
రెండు పడవల మీద కాళ్ళు పెట్టి ప్రయాణం చేసినట్లు
రోలొచ్చి మద్దెలతో మొర పెట్టుకుందిట…
రొట్టె విరిగి నేతిలో పడ్డట్లు
రౌతు కొద్దీ గుర్రం
రుణ శేషం శత్రు శేషం ఉంచరాదు
సంబరాల పెళ్ళికొడుకు సప్తాష్టం లో కూడా వసంతాలన్నాడట
సంకలో పిల్లాడిని ఉంచుకొని ఊరంత వెతికినట్టు
సంతోషమే సగం బలం
సర్వేంద్రియాణాం నయనం ప్రధానం
సత్రం భోజనం మఠం నిద్ర
సీత కష్టాలు సీతవి,పీత కష్టాలు పీతవి
సింగడు అద్దంకి పోనూ పొయ్యాడు రానూ వచ్చాడు
శివుని ఆజ్ఞ లేక చీమైన కుట్టదు
సొమ్మొకడిది సోకొకడిది
సుబ్బి పెళ్ళి ఎంకి చావుకి వచ్చింది
శుభం పలకరా పెళ్ళికొడకా అంటే పెళ్ళి కూతురు ముండ ఎక్కడ చచ్చింది అని అడిగాడట
శ్వాస ఉండేవరకు ఆశ ఉంటుంది
తడిగుడ్డతో గొంతులు కోసే రకం
తమ్ముడు తమ్ముడే,పేకాట పేకటే!
తా దూర కంత లేదు మెడకో డోలు
తా చెడ్డ కోతి వనమెల్లా చెరచిందట
తాడి తన్నే వాడి తల తన్నే వాడుంటాడు
తాళిబొట్టు బలం వల్ల తలంబ్రాల వరకూ బతికాడన్నట్టు
తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు
తాటాకు చప్పుళ్ళకు కుందేళ్ళు బెదురునా?
తాతకు దగ్గులు నేర్పుట
తల్లి పిల్లల అరుగుదల చూస్తుంది,తండ్రి పిల్లల పెరుగుదల చూస్తాడు
తన కోపమె తన శత్రువు
తన్ను మాలిన ధర్మం-మొదలు చెడ్డ బేరం
తంతే గారెల బుట్టలో పడ్డట్లు
తను చెస్తే శృంగారం,పరులు చెస్తే వ్యభిచారం
తను వలచిందే రంభ,మునిగిందే గంగ
తీగ లాగితే డొంకంతా కదిలినట్లు
తెగేదాకా లాగవద్దు
తేనె పూసిన కత్తి
తిక్కలోడు తిరనాళ్ళకు వెళితే ఎక్కా దిగా సరిపోయిందంట
తినే ముందు రుచి అడక్కు,వినే ముందు కథ అడక్కు
తినగా తినగా గారెలు కూడా చేదయినట్టు
తిండి కోసం బ్రతక్కు,బ్రతకడం కోసం తిను
తిండికి తిమ్మరాజు పనికి పోతరాజు
తింటే గారెలు తినాలి,వింటే భారతం వినాలి
తియ్యటి తేనె నిండిన నోటితొనే తేనెటీగ కుట్టేది
తిక్క మొగుడితో తీర్థం వెళితే తీర్థం అంతా తిప్పి తిప్పి కొట్టాడట
తిలా పపం తలా పిడికెడు
తిమ్మిని బమ్మిని చెయ్యడం
తిన్నింటి వాసాలు లెక్కపెట్టినట్టు
తుమ్మితే ఊడిపోయే ముక్కులా
ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు
ఉన్నదీ పోయింది,ఉంచుకున్నదీ పోయింది
ఉపాయం లేని వాడ్ని ఊళ్ళోంచి తరమాలి అన్నట్లు
ఉపకారానికి పోతే అపకారమెదురైనట్లు
ఉరుమురుమి మంగలం మీద పడ్డట్లు
ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికెగురుతానన్నట్టు
వాపును చూసి బలము అనుకున్నాడట
వడ్డించే వాడు మనవాడైతే యే పంక్తి లో కూర్చున్న పర్లేదు?
వడ్ల గింజలో బియ్యపు గింజ
వండుకున్నమ్మ కన్నా దండుకున్నమ్మే గొప్ప
వీపుమీద కొట్టవచ్చు కాని కడుపు మీద కొట్టరాదు
వెన్నతో పెట్టిన విద్య
వెర్రి వేయి విధాలు
వెయ్యి అబద్ధలాడైనా ఒక పెళ్ళి చెయ్యమన్నట్లు
వినేవాడు వెర్రి వెంగళప్ప అయితే చెప్పే వాడు వేదాంతిట
వినాశ కాలే విపరీత బుద్ధి
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
ఈ సామెతలన్నీ ఆంగ్ల వర్ణక్రమంలో కాకుండా, మన తెలుగు వర్ణక్రమంలో పెట్టవచ్చునే?
The Best Free Slot Machines Online | JTM Hub
slots online. The best free slot 시흥 출장안마 machines online. 밀양 출장안마 The best 삼척 출장샵 free slot machines online. The best free slot machines online. The best free slot 제주도 출장샵 machines online. 의정부 출장샵 The best
Post a Comment